వర్షాకాలం రాగానే జలుబు, జ్వరాలు వంటివి వస్తాయి. వీటిని తట్టుకునేందుకు రోగనిరోధక శక్తి అవసరం. అందుకే వర్షాకాలంలో కొన్నింటి నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంతో వెల్లుల్లి సాయపడుతుంది. పాలకూరలో ఉండే ఎన్నో పోషకాలు శక్తినిస్తాయి. తరచూ నట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.