బిస్కెట్లు అతిగా తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువగా బిస్కెట్లు తినేవారిలో కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మలబద్దక సమస్య వచ్చి ఇబ్బంది పడతారు. చాలా మంది టీలు, కాఫీలలో బిస్కెట్లను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఉదర భాగంలో మంట, గొంతు పట్టేయడం, ఆకలి వేయకపోవడం వంటివి జరుగుతుంటాయి. అందుకే వీలైనంత తక్కువగా బిస్కెట్లను తినడం మంచిది.