శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కలబంద కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఎంతో సహకరిస్తుంది. కలబంద గుజ్జుకు చెడు కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణం ఉంటుంది. కలబందలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ తోపాటు 18 రకాల అమైనోయాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, మెటబాలిజాన్ని పెంచుతాయి.