విటమిన్ బీ12తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని ‘మాక్రో సైటిక్ ఎనీమియా’ అంటారు. ఈ విటమిన్ లోపం వల్ల విపరీతమైన అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లోపం మరీ ఎక్కువైనప్పుడు మతిమరుపు, నరాల వీక్‌నెస్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. చేపలు, మాసం, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, పుట్టగొడుగులు, దంపుడు బియ్యంలో విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే సమస్య తగ్గుతుంది.