తెలంగాణలో మరో 14, 565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. రేపు, ఎల్లుండి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించారు. 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12వరకు పొడిగించారు.