పాలిటెక్నిక్ కోర్సుల్లో మరో 1, 170 సీట్ల పెంపునకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 8, 9వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్, 10న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 8 నుంచి 11 వరకు వెడ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు.