మెులకలు తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. మెులికెత్తిన గింజల్లో విటమిన్ ఎ, సి, బి1, బి6, కె ఎక్కువ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం కూడా సమృద్దిగా లభిస్తాయి. అలాగే పీచు, ఫోలేట్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.