బీట్‌రూట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తరచూ బీట్‌రూట్ రసం తాగడం వల్ల హై బీపీ సమస్య తగ్గుతుంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. తద్వారా రక్తనాళాలు వ్యాకోచం చెంది హై బీపీ సమస్య పోతుంది. ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్‌లో లభించే సయానిన్‌కు పెద్ద పేగు క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉంది. బీట్ రూట్ జ్యూస్ తాగే వారిలో లివర్ సమస్యలు రావు. మలబద్ధకం సమస్యను సైతం దూరం చేస్తుంది. అంతేకాకుండా సెక్స్ హార్మోన్లను కూడా సమపాళ్లలో విడుదల చేసింది.