శరీరానికి ఎంతో అవసరమైన నీటిని ఎలాపడితే అలా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది భోజనం, టిఫిన్ చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలైన రసాయనాలు పలుచబడతాయి. దీంతో తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవడం, సరిగ్గా జీర్ణమవకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. భోజనం చేసేటప్పుడు, భోజనం చేసిన 2గంటల వరకు నీరు తాగకపోవడమే మేలు.