డయాబెటిస్ ను "సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు, ఎందుకంటే చాలా మందికి వారు డయాబెటిస్‌తో బాధపడుతున్నారని తెలియదు. మందులు లేకుండా మధుమేహాన్ని నియంత్రించడానికి కొన్ని మార్గాలున్నాయి. ధూమపానం, మద్యపానం మానేయాలి. బరువు తగ్గాలి. వ్యాయామం చేయాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులుగా మీరు ఏం తింటున్నారనేది కూడా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం పోషకాలతో సమృద్ధిగా ఉండాలి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండాలి. ఈ వ్యాధిగ్రస్తులు ఒత్తిడికి లోనవ్వకూడదు. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ధ్యానం, యోగా చేయడం మంచిది.