ఈ నెల 19వ తేదీ నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాంతో పాలిసెట్ రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు వారి కళాశాల్లోనే మరో బ్రాంచీకి మారేందుకు అవకాశం ఉంది. తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 23వ తేదీన సీట్లు కేటాయిస్తారు. బ్రాంచ్ మారిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వర్తిస్తుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు.