అక్టోబర్‌లో గ్రూప్-3 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయించినట్లు సమాచారం. మరో వారం, పది రోజుల్లో పరీక్షా తేదీలను ప్రకటించనున్నారు. అయితే అక్టోబర్ నెలలో ఎస్ఎస్‌సీ, ఐబీపీఎస్‌తోపాటు పలు పరీక్షలు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకుని గ్రూప్-3 పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో పరీక్షలు నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa