2023-24 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌కు కమిటీ (ఎంసీసీ) శ్రీకారం చుట్టింది. అఖిల భారత కోటా మెడికల్ కళాశాలల్లో 50 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా తదితర కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మొదటి రౌండ్‌కు ఆగస్టు 1న రిజిస్ట్రేషన్ ముగియనుండగా.. ఫలితాలను 5న వెల్లడిస్తారు. రెండో కౌన్సిలింగ్‌కు ఆగస్టు 21లోపు రిజిస్ట్రేషన్ పూర్తి కానుంది. 25న సీట్లను కేటాయిస్తారు.