కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి మన అలవాట్లే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినడం అరోగ్యానికి మంచిది కాదు. రెడ్ మీట్, బర్గర్, పిజ్జా వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, ఊబకాయలుగా మారుతారు. బద్దకం వల్ల చాలా సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. ఇది కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. ఇలాంటి తప్పులు చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారాన్ని, ఆకుకూరలను తీసుకోవాలని సూచిస్తున్నారు.