చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువ పండ్లు, కూరగాయల సూప్‌లు, అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని తినాలి. మెంతులను రాత్రి నానబెట్టి ఆ నీళ్లను ఉదయం తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు, మలం సులువుగా బయటకు వెళ్లిపోతుంది. మలబద్ధకం ఉన్న వారు జీలకర్ర, పెరుగు, నెయ్యి, జంక్ ఫుడ్, మసాలా ఫుడ్స్ తినరాదు. కాఫీ, టీ వంటివి తాగరాదు.