వైరస్ వల్ల వచ్చే ఫోలిక్యులర్ కళ్ల కలకతో కంటి చూపునకు ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. కళ్లు ఎరుపెక్కడం, దురద, కాంతిని చూడలేకపోవడం, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలు కళ్ల కలక బాధితుల్లో కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి, ఇంట్లో ఒకరికి సోకితే వెంటనే మిగతా వారికీ అంటుకుంటుంది. దురదగా ఉందని కళ్లు నలపడం, సొంత వైద్యం చేసుకోవడం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.