మన శరీరంలో బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటేనే మిగతా జీవక్రియలన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ మెదడు బలహీనపడటంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మసకబారుతుంది. కొన్ని చిట్కాలతో బ్రెయిన్ షార్ప్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెడిటేషన్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ధ్యానం చేసేవాళ్లు ఏ విషయాన్నైనా తొందరగా గుర్తుకు తెచ్చుకోగలరు, నేర్చుకోగలరు. వ్యాయామంతో శరీరానికే కాదు. మెదడుకూ మేలు జరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ రక్తం ద్వారా సరఫరా అవుతుంది. దీంతో మెరుగైన ఆలోచనలు, సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా సుడోకు, క్రాస్ వర్డ్ ల వంటి ఆటలు ఆడితే మెదడు తన పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభిస్తుంది.