వర్షాకాలంలో పసుపును నీటిలో మరిగించి తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలుంటాయి. పసుపును నీటిలో మరిగించేటప్పుడు కొన్ని తులసి ఆకులు, అల్లం వేసుకోవచ్చు. మిరియాలను పసుపుతో కలిపి మరిగిస్తే పసుపులోని పోషక విలువలు శరీరానికి ఎక్కువగా అందుతాయి. వాము, మెంతులు, జీలకర్రలను కలిపి ఓ గ్లాస్ నీళ్లలో మరిగించి కషాయంలా చేసి తాగాలి.