ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2023, 11:20 AM

దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం ను వాడుతారు. పూజ సామగ్రిలో ప్రతిఇంట తప్పనిసరిగా కర్పూరం ఉంటుంది. అయితే కర్పూరం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విక్స్‌, ఆవిరి, దగ్గు సిరప్‌లు, బిళ్లల తయారీలోనూ కర్పూరం వాడుతారట. కర్పూరం ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- సాధారణ జలుబుకు కర్పూరం దివ్వ ఔషధం. జలుబు సమయంలో కాస్త కర్పూరం ఆయిల్‌ను ఛాతీ, విపుపై రాయడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందని పలువురు సూచిస్తున్నారు.


- జుట్టు రాలే సమస్యను కూడా కర్పూరం తగ్గిస్తుంది. సాధారణ హెయిర్ ఆయిల్‌లో కొన్ని చుక్కల కర్పూరం నూనెను కలిసి మర్దన చేస్తే తలలో రక్త ప్రసరణను పెరిగి, జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు.


- తలలో పేనుల నివారణకు కర్పూరం ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కాస్త కర్పూరం కలిపి జుట్టుకు పట్టించాలి. అనంతరం షాంపూతో శుభ్రం చేసుకుంటే పేనుల సమస్య తగ్గుతుంది.


- శరీరంలోని ఏ చోటైనా మంటగా లేదా వాపుగా అనిపిస్తే కర్పూరం మ్యాజిక్‌లా పనిచేస్తుంది. దద్దుర్లు వచ్చినప్పుడు కర్పూరం నూనెను నీటితో కలిపి వాడటం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. తామరకూ కర్పూరం గొప్ప నివారణగా పనిచేస్తుంది.


- గోరు చుట్టును కర్పూరం కొంత మేర తగ్గిస్తుంది.


- రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం సమస్య నుంచి బయటపడేందుకు కర్పూరం సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని కర్పూరం చుక్కలను బెడ్‌, తలదిండుపై వెదజల్లితే చక్కటి నిద్ర పడుతుందని పలువురు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com