మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది మెదడు పనితీరును ప్రభావం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారంతో పాటు అరటి, బాదం, పాలు మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు. అలాగే విటమిన్ బి ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల ఆవేశం తగ్గి ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. సోయా ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బలపడుతుందని సూచిస్తున్నారు.