ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండ్ల రసాలను వల్ల కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2023, 03:39 PM

వేసవిలో‌ ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు వివిధ పళ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో నీళ్లు తాగడం, పళ్ల రసాలు తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ, నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఏ, సీ లు పుష్కలంగా ఉంటాయి.
- మలబద్దకం సమస్య తొలగిపోతుంది.
- ఎండ వేడి వల్ల వచ్చే మూత్రంలో మంటను నివారించవచ్చు.
- కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి
- చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి.
- పేగుల్లో మలినాలను తొలగిస్తాయి.
- ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి
- నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌ లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. వీటి వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.
- శరీరంలో నీటి శాతం పెరుగుతుంది
- బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
- పుచ్చకాయల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి
- గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
- డయాబెటిస్‌ వ్యాధి అదుపులో ఉంటుంది.
- శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com