గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం డిజిటల్ యాప్స్ ల్లో యూపీఐ లైట్ వాలెట్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. లైట్ వాలెట్ చెల్లింపు గరిష్ట పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచింది. ఈ విధానంలో ఆఫ్ లైన్ లోనూ చెల్లింపులు చెయ్యొచ్చు. అయితే, రోజుకు రూ.2 వేల వరకు చెల్లింపులు చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దీని ద్వారా నెలకు రూ.కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.