టైఫాయిడ్, డెంగీ జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కువగా ప్లేట్‌లెట్స్ క్షీణిస్తుంటాయి. ఆ సమయంలో రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి పడిపోతుంది. దీంతో ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలుకూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవి పెరగడానికి బొప్పాయి ఆకు ఎంతగానో ఉపకరిస్తుంది. లేత బొప్పాయి ఆకును సేకరించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాలి. అందులో కొంచెం పంచదార, నీరు పోసి జ్యూస్ చేసుకుని తాగేయండి. రోజుకు రెండు, మూడు సార్లు ఇలా చేస్తే వెంటనే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి.