ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా చాల మంద గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సరైన ఆహారం తీసుకుంటే కొంత వరకు గుండెకు వచ్చే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఎరుపు మాంసం అనగా గొడ్డు మాంసం, గొర్రె మాంసం, పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.