ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ (ఎక్స్) యూజర్లకు భారీ షాకిచ్చింది. ఇప్పటికే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చందా విధానాన్ని అమలు చేస్తోంది. త్వరలో ట్విట్టర్ ఖాతాదారులందరికీ నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. అయితే ఎంత వరకు ఫీజు వసూలు చేస్తారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.