ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు, ముడి ధాన్యాలు, కొవ్వు లేని మాంసం, చేపలు, ఎండు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తీసుకుంటే టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఇప్పటికే ఉన్న వాళ్లు దాన్ని నియంత్రించుకోవటం కూడా తేలిక అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రకరకాల పప్పులను కలిపి వండుకునే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. నూనె పెద్దగా లేని చపాతీల వంటివి, వాటిల్లోనూ మెంతికూర వంటివి కలుపుకొని వండుకోవటం మేలు.