కొంతమంది ద్రాక్షపండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ ద్రాక్ష పండ్లను అపమిరిమిత సంఖ్యలో తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్షలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణ సమస్యలను కలిగిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే ద్రాక్ష ఎక్కువ తింటే అలెర్జీ సమస్య సైతం వస్తుందట. అలాగే ఒకోసారి ఎక్కువ ద్రాక్షలు తినడం వలన కేలరీలు చాలా త్వరగా పెరిగిపోతాయి. చాలా పండ్లలాగే ద్రాక్షల్లోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తినడం వలన మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.