మేషం: ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
వృషభం: దీర్ఘ కాలిక రుణాల ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున సమస్యలు ఉంటాయి.
మిధునం: దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కర్కాటకం: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. బందు వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
సింహం: సంఘంలో గౌరవ మర్యాదలకు కొదవు ఉండదు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య: ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కలుగుతుంది.
తుల: ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించినస్థానచలనాలు ఉండవు.
వృశ్చికం: ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేస్తారు.
ధనస్సు: గృహమున పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు.
మకరం: ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అవకాశములు దక్కుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
కుంభం: ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ వత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.
మీనం: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.