రోడ్డు పక్కన విక్రయించే చిరుతిళ్లు, ఆహార పదార్థాలను సాధారణంగా పాత న్యూస్ పేపర్లలో కట్టి ఇస్తుంటారు. ఇలాంటి ఆహారం తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)’ హెచ్చరించింది. ప్యాకింగ్, సర్వింగ్ కోసం న్యూస్ పేపర్ల వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని వ్యాపారులను కోరింది. నిబంధనల పర్యవేక్షణకు రాష్ట్ర అధికారులతో కలిసి పని చేస్తోంది.