పెసర మొలకలను అల్పాహారంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పెసర మెలకలు తినడం వల్ల శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది మరియు క్రిములతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెసా మొలకలలోని ప్రధాన ప్రోటీన్లు గ్లోబులిన్ మరియు అల్బుమిన్ కండరాలను దృఢంగా చేస్తాయి. వీటిలోని ఐరన్ మరియు కాపర్ రక్తకణాలను పెంచి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.