చలికాలంలో మధుమేహ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చలి కాలంలో క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, బచ్చలి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, గ్రీన్ బీన్స్, బఠానీలు, మొక్కజొన్నలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.
శరీర బరువును అదుపులో ఉంచుతాయి. క్యారట్, ముల్లంగి వంటి దుంపల్లో ఫైబర్ తో పాటు ఏ, బి6, సి, ఇ, కె-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని జింక్ ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు, బెర్రీ పండ్లు తినడం మంచిది. ప్రోటీన్ కోసం మాంసం, చేపలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే గుడ్లను తినాలి.