కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైన అవయవాలు. మనం తీసుకునే ఆహారం, నీటితోనే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో రెడ్ క్యాప్సికమ్ సహాయపడతాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇందులో ఎ, సి, బి6 విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.