ఉప్పుని ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఉప్పుని మరీ తగ్గించి తీసుకోవటం కూడా మంచిది కాదు. సినీనటి శ్రీదేవి తెరపై అందంగా కనిపించడం కోసం ఉప్పులేని ఆహారం తీసుకునేదని, హైబీపీ సమస్య వలనే ఉప్పు తక్కువ తినేదాని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. ఉప్పు శరీరంలో నీటిని నిలిచి ఉండేలా చేస్తుంది. ఉప్పుని ఎక్కువగా వాడితే అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలు రావచ్చని నిపుణులు తెలిపారు. మీడియం స్థాయిలో ఉప్పును తీసుకోవడం ఉత్తమం.