పటికబెల్లం... చిన్న పిల్లలకు ఎక్కువగా వాడుతుంటారు. పంచదార వాడితే జలుబు చేస్తుందని ఎక్కువ శాతం ఇళ్లలో చిన్న పిల్లలకు పాలలో పటికబెల్లం కలిపి పట్టిస్తుంటారు. అయితే, చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా పటికబెల్లాన్ని వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందామా...
-పటికబెల్లానికి చలవ చేసే గుణం ఉంది. సో... శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండేవాళ్ళు కొద్దిగా పటికబెల్లాన్ని తీసుకుని నీటిలో కలిపి తాగితే వేడి తగ్గుతుంది.
-పటిక బెల్లాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.
-పటిక బెల్లం పొడిని పాలలో వేసుకుని తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి.
-వేడి వేడి పాలలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది.
-పటిక బెల్లాన్ని వాడడం వల్ల బాలింతలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.