తులసి మొక్కను ప్రతి ఒక్కరూ పవిత్రంగా పూజిస్తారు. అలాంటి తులసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ మరియు ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.