కోడిగుడ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలుంటాయి. కోడిగుడ్డు తింటే రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. బరువు తగ్గొచ్చు. గుడ్డులో లభించే విటమిన్ ఏ కంటి సమస్యలను పోగొడుతుంది. రోజూ గుడ్డు తింటే ఐ సైట్, శుక్లాలు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. గుడ్డులో ఉండే విటమిన్ డీ, సల్ఫర్ గోళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుంది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.