రోజంతా చురుకుగా ఉండాలంటే కంటినిండా నిద్ర పోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుందని వివరిస్తున్నారు. దీని ద్వారా మరుసటి రోజును తాజాగా, నూతనోత్సాహంతో ఆరంభించవచ్చని పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్యానికి సరైన ఆహారంతోపాటు నిద్ర కూడా అవసరమని తెలుపుతున్నారు.