పనస పండు శరీరంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే పనస పండు విత్తనాలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. వాటికి ఉప్పు, మిరియాలతో ఉడికించి లేదా వేయించి రుచికరమైన ఆహారం తయారు చేసుకోవచ్చంటున్నారు. జింక్, విటమిన్లు, ఫైబర్ వంటి ఖనిజాలతో సమృద్దిగా ఉండే ఇవి మీ ఆహారంలో జోడించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.