తంగేడు చెట్టు యొక్క వేరును తీసుకొని కాషాయం చేసుకొని తాగడం వల్ల నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. తంగేడు బెరడును నమిలి రసం మింగిన విరేచనాలు తగ్గుతాయి. దగ్గుతో బాధపడేవారు తంగేడు చెట్టు లేత ఆకులను బాగా నమిలి మింగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్దక సమస్యతో బాధపడుతున్న వాళ్లు తంగేడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటితో తాగడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది.