యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలను కలపించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించే పనిలో ఉంది. ప్రస్తుతం కొండపైకి వెళ్లేందుకు మినీ బస్సులతో పాటు వ్యక్తిగత వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో పార్కింగ్, కాలుష్యం సమస్యలు తలెత్తే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచి, విద్యుత్ బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.