హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. వివాహానంతరం వధువు 16 అలంకారాలలో మంగళసూత్రం ముఖ్యమైనది కూడా. ఇది బంగారం, నల్ల పూసలతో ప్రత్యేకంగా చేయిస్తారు. అయితే, వివాహిత స్త్రీలను, వైవాహిక జీవితాన్ని చెడు దృష్టి నుండి రక్షించడానికి నల్లపూసలు రక్షణగా పనిచేస్తుందని హిందువులు నమ్ముతారు. అంతేకాదు, నల్ల పూసలను శివునికి చిహ్నంగా పరిగణిస్తారు. కావున తన భర్తకు రక్షణ కవచంగా ఉంటుందని విశ్వసిస్తారు.