యాపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ pHని సమతుల్యం చేస్తుంది. ఇది చుండ్రు పెరుగుదలకు దోహదపడే.. ఈస్ట్ పెరుగుదలను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్, నీళ్లను సమాన భాగాలుగా తీసుకుని మిక్స్ చేయండి. దీన్ని తలకు అప్లై చేయండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు రిపీట్ చేస్తే.. చుండ్రు సమస్య దూరం అవుతుంది.
వీటిని కలిపి తినొద్దట: ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఈ క్రమంలో మనం తీసుకునే పదార్థాల్లో కొన్ని కలిపి తీసుకోకూడదంటున్నారు నిపుణులు. తద్వారా ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గవచ్చని అంటున్నారు. అన్నం+బంగాళాదుంపలు, ఓట్స్+డ్రై ఫ్రూట్స్, స్నాక్స్+డ్రింక్స్ కలిపి తీసుకుంటే బరువు సమస్య పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.