పొద్దున మనం లేచి ఏదైతే చూస్తామో దానిలానే రోజంతా గడస్తుందంట. అందుకే కొంతమంది లేవగానే పిల్లల ముఖాలు చూస్తుంటారు. అయితే ఉదయం లేవగానే ఏంచూస్తే మంచిదో తెలుసుకుందాం.
ఉదయం లేవగానే తమ అరచేతిలను చూసుకోవడం మంచిదంట. అలాచూడటం వలన అమ్మవారి దర్శనం కలుగుతుందంట. నిద్ర లేచిన తర్వాత భూమిపై కాలు మోపే సమయంలో, భూమికి నమస్కరిచడం మంచిదని పండితులు చెపుతుంటారు. పొద్దున్నే సూర్యుడు, ఆవు, ధర్మపత్ని, గోపురం చూడటం శుభ సూచకం.