గురక పెట్టేవాళ్ళ పక్కన పడుకుంటే ఆ నరకం అంతా ఇంతా కాదు. ఆ గురక వింటే ఎంత చిరాకు వస్తుందో మనకు తెలిసిందే. అయితే ఈ గురక సమస్య ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు. గురక పక్కనవారి నిద్ర చెడగొట్టటమే కాక, ప్రమాదకరమైన స్లీప్ డిజార్డర్, స్లీప్ అప్నియాకు దారి తీయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. స్లీప్ అప్నియా అంటే నిద్రలో ఉన్నపుడు శ్వాస మాటిమాటికీ ఆగిపోతూ ఉంటుంది. స్లీప్ అప్నియా వల్ల ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది.