తిరుమల భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఈ మేరకు వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవలకు కేటాయించే టికెట్లను తగ్గించి, ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం, రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం టికెట్ల కోటాను పెంచనుంది. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఇవ్వనున్నట్లు చెప్పింది.