సమ్మర్‌లో చాలా మంది చెరకు రసం తాగడానికి తెగ ఇష్టపడతారు. అయితే చెరకు రసాన్ని ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చెరకు రసాన్ని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతుంది. ఇందులో ఉండే పాలీకోసనల్ అనే పదార్థం.. రక్తాన్ని పలుచగా చేస్తుంది. అంటే రక్తాన్ని గడ్డకట్టకుండ చేస్తుంది. అందుకే చెరకు రసాన్ని ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.