ప్రతి రోజు ఉదయం టీ, కాఫీలకు బదులుగా కుంకుమ పువ్వు నీరు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. కుంకుమ పువ్వులో ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం, శరీర ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని కుంకుమపువ్వు నీటితో నిరోధించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.