వర్షాకాలం అంటేనే.. సీజనల్ వ్యాధుల కాలం. వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా చిన్నారులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కనుక వర్షాకాలంలో తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.