మహిళలు తరచూ కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గర్భిణులకు వాంతులు, వికారం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక కొబ్బరి బొండం తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కొబ్బరి నీళ్లు సాయపడతాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా మలబద్ధకం సమస్యకు చెక్ పెడతాయి.