బైరెడ్డిపల్లి మండలంలోని నాగిరెడ్డిపల్లె-తిరుమల నాయుని కుప్పం గ్రామాల మద్య వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి 3రోజుల పాటు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు సాయంత్రం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తామన్నారు. 28న ద్వజారోహణం, గిరిజా కళ్యాణోత్సవం, వృషభ వాహనోత్సవం, 29న రథోత్సవం, 30న అగ్ని గుండ ప్రవేశం నిర్వహించనున్నారు.